: యూఎస్ ఓపెన్ సెమీస్ కు చేరిన సానియా-హింగిస్ జోడీ


టెన్నిస్ జోడీ సానియా మీర్జా- మార్టినా హింగిస్ జోడీ దూసుకుపోతున్నారు. తాజాగా యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో మహిళల డబుల్స్ విభాగంలో వారిద్దరూ సెమీఫైనల్లో అడుగుపెట్టారు. క్వార్టర్ ఫైనల్లో తైపీ యంగ్ జాన్ చాన్-చింగ్ చాన్ జోడిపై 7-6(5), 6-1 తేడాతో సానియా జోడీ గెలుపొందింది. దాదాపు 85 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్ లో సానియా-హింగిస్ లు నాలుగు బ్రేక్ పాయింట్లు సాధించారు. దాంతో సెమీఫైనల్లో ఇటలీకి చెందిన సారా ఎరానీ-ప్లవియా పెనెట్టా జోడీతో వారిద్దరూ తలపడనున్నారు. ఈ ఏడాది వింబుల్డన్ లో తొలిసారి గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న ఈ సానియా జోడీ వరుసగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్ దక్కించుకునే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News