: రాజధానిలో రైతన్న ఆత్మహత్య...కట్టమైసమ్మ గుడి వద్ద ప్రాణాలొదిలిన అన్నదాత


తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. జీవనాధారమైన సాగు అప్పుల ఊబిలోకి నెడుతున్న నేపథ్యంలో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతులు బలవన్మరణం బాట పడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో వెయ్యి మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు వచ్చిన ఓ అన్నదాత రాష్ట్ర పాలనాయంత్రాంగ కేంద్రం సచివాలయానికి కూతవేటు దూరంలోని లోయర్ ట్యాంక్ బండ్ లో ప్రాణాలు తీసుకున్నాడు. అక్కడి కట్టమైసమ్మ ఆలయ సమీపంలోని ట్రాన్స్ ఫార్మర్ కు ఉరేసుకుని, లింబయ్య అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సొంత జిల్లా నిజామాబాదు జిల్లాలోని రత్నాలరాంరెడ్డిపల్లి లింబయ్య సొంతూరుగా తెలుస్తోంది. సాగు నేపథ్యంలో రూ.2 లక్షల మేర అప్పుల భారంతో సతమవుతున్న లింబయ్య, ఇటీవల చేతికొచ్చిన కొడుకు అనారోగ్యానికి గురికావడంతో మరింత కుంగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన నిన్న హైదరాబాదు వచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News