: హైదరాబాద్ నుంచి భారీ వృక్షాన్ని వేర్లు సహా పెకలించి తీసుకెళ్లిన కర్ణాటక మంత్రి!


ఓ కర్ణాటక మంత్రి హైదరాబాదులో ఓ మహా వృక్షాన్ని కొనుగోలు చేశారు. అది కూడా రూ.12 లక్షలు వెచ్చించి కొనడం గమనార్హం. ఇంతకీ దాన్నేదో కలప కోసమో, వేరే అవసరాల కోసమో అనుకుంటే పొరపాటే! సదరు మంత్రిగారు తన ఇంట్లో ఆ భారీ వృక్షాన్ని నాటుకోవడం కోసం కొన్నారట. అందుకే మూడు మీటర్ల చుట్టుకొలత ఉన్న ఆ వృక్షాన్ని జాగ్రత్తగా వేర్లు సహా బయటకు తీశారు. అనంతరం దానిని హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఇప్పటికే లారీ ద్వారా రవాణా చేశారు. ఇందుకోసం, వృక్షాన్ని పెకిలించినందుకు లక్ష, రవాణా కోసం రూ.50వేలు ఖర్చు చేయడం విశేషం. ఆ వృక్షం వైద్యపరంగా కొన్ని రకాల మందుల తయారీకి ఉపయోగపడుతుందని అంటున్నారు.

  • Loading...

More Telugu News