: బాధగా వుంది, కానీ రాజీనామా చేయను: ముంబై మాజీ పోలీస్ బాస్
అకస్మాత్తుగా తనను బదిలీ చేయడంపై ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా స్పందించారు. ఈ నిర్ణయం తనకు బాధను కలిగించిందని, అయినప్పటికీ, రాజీనామా చేసే ఆలోచన తనకు లేదని ఆయన స్పష్టం చేశారు. తక్కువ సమయంలో షీనా బోరా హత్య కేసును విచారించిన ఆయన, తాను రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలను అవాస్తవమని అన్నారు. తనకు ప్రమోషన్ ఇస్తూ, బదిలీ చేసినా, తనకు ముంబై పోలీసు కమిషనర్ గా ఉండటమే ఇష్టమని అన్నారు. ఆయన్ను మహారాష్ట్ర హోంగార్డ్స్ విభాగం డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఆయన బదిలీ వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం ఫడ్నవీస్ కు రాకేష్ మారియాకు పొసగని కారణంగానే బదిలీ జరిగిందని, అందుకే ప్రమోషన్ పేరిట పెద్దగా ప్రాధాన్యం లేని శాఖకు ఆయన్ను పంపారని పోలీసు శాఖలో గుసగుసలు వినిపిస్తున్నాయి.