: ఢిల్లీలో జలదీక్ష చేపట్టిన బైరెడ్డి... ‘సీమ’ హక్కులు కాపాడాలని డిమాండ్
రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అధినేత, రాయలసీమ జల సాధన సమితి నేత, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. నిన్ననే ఢిల్లీ చేరుకున్న ఆయన రాయలసీమకు న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం జలసాధన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రాయలసీమకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. రాయలసీమ హక్కుల పరిరక్షణ, న్యాయంగా దక్కాల్సిన నీటి కేటాయింపులపై కేంద్రం దృష్టి సారించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.