: టీడీపీ నేత మహదేవనాయుడు కుటుంబసభ్యులకు లోకేష్ పరామర్శ
చిత్తూరు జిల్లాలో ఇటీవల మరణించిన టీడీపీ నేత గురజాల మహదేవనాయుడు కుటుంబాన్ని టీడీపీ కార్యకర్తల సంక్షేమనిధి సమన్వయకర్త నారా లోకేష్ ఈ రోజు కలిశారు. అతని కుటుంబసభ్యులను పరామర్శించారు. మహదేవనాయుడి మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. జిల్లాలో పార్టీ పటిష్ఠతకు ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. తప్పకుండా మహదేవనాయుడి కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందని ఈ సందర్భంగా లోకేష్ హామీ ఇచ్చారు. ట్విట్టర్ లో కూడా ఆయన మృతి పట్ల లోకేష్ విచారం వ్యక్తం చేశారు.