: జీడిమెట్లలో కాల్పుల కలకలం... ప్రైవేట్ కంపెనీ అకౌంటెంట్ పై దుండగుల దాడి


హైదరాబాదు శివారు పారిశ్రామికవాడ జీడిమెట్ల పరిధిలోని షాపూర్ నగర్ లో నిన్న రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఉషోదయ అపార్ట్ మెంట్ వద్ద ప్రైవేట్ కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాఘవశర్మ అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. తొలుత ఇనుప రాడ్ తో శర్మపై దాడి చేసిన దుండగులు ఆ తర్వాత పిస్టల్ తో కాల్పులకు దిగారు. అనంతరం శర్మ చేతిలోని బ్యాగుతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ దాడిలో శర్మకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఓ బుల్లెట్ ను స్వాధీనం చేసుకున్నారు. శర్మకు బుల్లెట్ వల్ల ఎలాంటి గాయం కాలేదని నిర్ధారించిన పోలీసులు ఇనుప రాడ్ దాడి వల్లే గాయమైందని తేల్చారు. ప్రస్తుతం అక్కడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శర్మ చికిత్స పొందుతున్నాడు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News