: యమన్ స్మగ్లర్లపై సౌదీ వైమానికి దాడులు... 20 మంది భారతీయుల దుర్మరణం


స్మగ్లర్లు అనుకొని సౌదీ విమానాలు జారవిడిచిన బాంబులకు 20 మంది భారతీయులు బలయ్యారు. వీరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు విదేశాంగ శాఖ ప్రకటించింది. గత కొద్ది రోజులుగా తిరుగుబాటుదారులపై సౌదీ సైన్యం దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే, యమన్ సముద్రతీరంలోని అల్విదా పోర్టుపై యుద్ధ విమానాలు బాంబులేశాయి. చమురు స్మగ్లర్ల పడవలను టార్గెట్ చేస్తూ, సౌదీ అరేబియా ఈ దాడులు చేసింది. గత కొద్ది కాలంగా యమన్ లో అంతర్యుద్ధం పెరిగిన సంగతి తెలిసిందే. హౌతీ తిరుగుబాటుదారులకు, సైన్యానికి మధ్య పలు ప్రాంతాల్లో పోరు జరుగుతోంది. ఈ దాడుల్లో చనిపోయిన భారతీయుల వివరాలు ఇంకా తెలియకపోవడంతో, యమన్ లో వివిధ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. కాగా, యమన్ లో చిక్కుకుపోయిన వేలాది మంది ఇప్పటికే ఇండియాకు తరలిరాగా, ఇంకా 5000 నుంచి 6000 మంది వరకూ అక్కడ ఉండి వుంటారని అంచనా. యమన్ లోని కొన్ని ప్రాంతాలు హౌతీ తిరుగుబాటుదారుల చేతుల్లోకి వెళ్లడం ఆందోళన కలిగిస్తోంది.

  • Loading...

More Telugu News