: టీమిండియా మాతో ఆడకపోయినా నష్టమేమీ లేదు... మాట మార్చిన పీసీబీ చీఫ్


పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ షహర్యార్ ఖాన్ మాట మార్చేశారు. నిన్నటిదాకా తమ జట్టుతో ఆడండంటూ టీమిండియా వెంటబడ్డ ఆయన ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారు. డిసెంబర్ లో భారత్-పాక్ మధ్య జరగాల్సిన సిరీస్ పట్ల బీసీసీఐ వెనుకంజ వేసిన నేపథ్యంలో, సిరీస్ జరగకపోయినా తమకేమీ నష్టం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్- పాక్ జట్ల మధ్య సిరీస్ కు ఇరు దేశాల బోర్డుల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బీసీసీఐ మెలిక పెడుతోంది. మేమేమీ వారి వెంటపడటం లేదు. ఒప్పందాన్ని గౌరవించమని మాత్రమే చెబుతున్నాం’’ అని ఆయన నిన్న వ్యాఖ్యానించారు. ఇటీవల కోల్ కతాకు గుట్టు చప్పుడు కాకుండా వచ్చిన షహర్యార్, బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే భారత్ తో మ్యాచ్ ల కోసం వెంపర్లాడాల్సిన అవసరమేమీ లేదని ఆ దేశ మాజీ క్రికెటర్ జావెద్ మియాందాద్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో షహర్యార్ యూటర్న్ తీసుకున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News