: పరారీలో బంగ్లా క్రికెటర్!...వెదుకుతున్న పోలీసులు


అడ్రెస్ లేకుండా పోయిన బంగ్లాదేశ్ క్రికెటర్ కోసం ఆ దేశ పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పనిపిల్లను భార్యతో కలిసి హింసించిన కేసులో బంగ్లా క్రికెటర్ షహదత్ హుస్సేన్ పై ఆ దేశ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, అప్పటి నుంచీ షహదత్ అడ్రెస్ లేకుండా పోయాడు. ప్రస్తుతం అతడు ఎక్కడున్నాడో కూడా ఆ దేశ పోలీసులకే కాక అతడి స్నేహితులు, బంగ్లా క్రికెట్ జట్టు సభ్యులకు అంతుపట్టడం లేదు. భార్యతో కలిసి ఉడాయించిన షహదత్ కనీసం ఫోన్ లో కూడా అందుబాటులోకి రావడం లేదట. అయితే షహదత్ ను ఎలాగైనా అరెస్ట్ చేయాల్సిందేనన్న పట్టుదలతో పోలీసులు అన్ని మార్గాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News