: భారత రియల్టీలోకి దూకిన ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్!
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఓ వినూత్న బిజినెస్ లోకి దిగాడు. ఆస్ట్రేలియాలో ఉంటూనే అతడు భారత్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేేస్తున్నాడు. ఇందుకోసం మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అతడు ‘వాగ్లోబల్. కామ్’ పేరిట ప్రత్యేక వెబ్ పోర్టల్ ఏర్పాటు చేశాడు. ఈ పోర్టల్ ద్వారా భారత్ లో స్థిరాస్తుల క్రయవిక్రయాలు, మెయింటెనెన్స్ తదితరాలను ‘వాగ్లోబల్’ నిర్వహించనుంది. ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులే లక్ష్యంగా స్టీవ్ వా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడట. ‘‘భారత్ అవకాశాలు అపారం. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టినందుకు సంతోషిస్తున్నా. ఈ పోర్టల్ ద్వారా భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు కృషి చేస్తా’' అని స్టీవ్ వా పేర్కొన్నాడు.