: కేంద్ర ఉద్యోగుల వేతనం మూడింతలు పెరగనుందట!... ఏడో వేతన సంఘంపై ఊహాగానాలు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం వచ్చే జనవరి నుంచి భారీగా పెరగనుందన్న ఉహాగానాలు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన పెంపుపై అధ్యయనం చేస్తున్న ఏడో వేతన సంఘం నవంబర్ లో ప్రభుత్వానికి తన నివేదికను అందించనుంది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఉద్యోగులకు వేతనాలు పెంచడం ఖాయమే. ఇప్పటికే పలు ఉద్యోగ సంఘాల వాదనలు, ఇప్పటిదాకా వచ్చిన ఆరు వేతన సంఘాల నివేదికలను పరిశీలిస్తున్న మాధుర్ నేతృత్వంలోని ఏడో పే రివిజన్ కమిషన్ దాదాపుగా తన నివేదికకు తుది రూపునిచ్చే పనిలో ఉంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఏడో పే రివిజన్ కమిషన్ సిఫారసులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనం ఒకేసారి మూడింతలు కానుందట. బేసిక్ శాలరీలో డీఏ, హెచ్ఆర్ఏను కలపడంతో పాటు పిల్లల విద్యకు సంబంధించిన అలవెన్సులు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది.