: దూసుకెళుతున్న కేసీఆర్... తొలి రోజే రూ.1,000 కోట్ల పెట్టుబడులు రాబట్టిన వైనం


కొత్త రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టమే లక్ష్యంగా ‘డ్రాగన్’ గడ్డపై అడుగుపెట్టిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలిరోజే మెరుగైన ఫలితం రాబట్టారు. 19 మంది ప్రతినిధుల బృందంతో మొన్న హైదరాబాదు నుంచి బయలుదేరిన కేసీఆర్, నిన్న ఉదయమే రంగంలోకి దూకేశారు. చైనాలోని డేలియన్ నగరంలో పారిశ్రామికవేత్తలతో జరిగిన భేటీలో ఆయన రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులను రాబట్టగలిగారు. కేసీఆర్ ప్రతిపాదనలకు ముచ్చటపడ్డ చైనా కంపెనీ లియో గ్రూపు తెలంగాణలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. డ్యూటీ పంపుల తయారీలో ఉన్న లియో గ్రూపు తెలంగాణలో కొత్తగా యూనిట్ ను ప్రారంభించేందుకు ఆసక్తి కనబరచింది. లియో గ్రూపుతో పాటు కేసీఆర్ తో భేటీ అయిన మరో 30 పారిశ్రామిక సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆసక్తి కనబరచాయట.

  • Loading...

More Telugu News