: మరో ‘ప్రైవేట్’ ప్రమాదం... లారీని ఢీకొట్టిన ‘మార్నింగ్ స్టార్’ బస్సు, 15 మందికి గాయాలు


తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలకు చెక్ పడట్లేదు. మితి మీరిన వేగంతో దూసుకుపోతున్న ట్రావెల్స్ బస్సులు ప్రమాదాలకు గురవుతూ పదుల సంఖ్యలో ప్రజల ప్రాణాలను హరించేస్తున్నాయి. పెద్ద సంఖ్యలో ప్రయాణికులను గాయాలపాల్జేస్తున్నాయి. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం నవాబ్ పేట వద్ద నేటి తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ తరహా మరో ప్రమాదం చోటుచేసుకుంది. నిండా ప్రయాణికులతో హైదరాబాదు నుంచి విజయవాడకు బయలుదేరిన మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు నవాబ్ పేట వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో 15 మందికి గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News