: ఉల్లిపాయలకు, వ్యాపారులకు సాయుధ భద్రత


పూణెలోని 'పిమ్ ప్రీ' రిటైల్ కూరగాయల మార్కెట్ లోని ఉల్లిపాయ స్టాకులకు, ఉల్లి వ్యాపారులకు సాయుధ సెక్యూరిటీ గార్డులు భద్రత కల్పిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సుమారు 400 కిలోల ఉల్లిపాయలను కొందరు దుండగులు దొంగిలించుకుని వెళ్లడమే కాకుండా, కొంతమంది వ్యాపారులను చితకబాదిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేశారు. 'పిమ్ ప్రీ'..చిన్చ్ వాడ్ మున్సిపల్ కార్పొరేషన్, భద్రత కల్పించకపోవడంతో తామే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నామని, ఆ ఖర్చులు తామే భరిస్తామని మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విష్ణు సాల్వ్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News