: పిల్లలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం లేదా?... అయితే వాళ్లని ఏదోలా నవ్వించండి!


మీ పిల్లలు ఏదయినా కొత్త విషయం నేర్చుకోవడానికి అనాసక్తి చూపుతున్నారా? అయితే వారిని కాసేపు నవ్వించండి, హాయిగా నేర్చుకుంటారని పరిశోధకులు చెబుతున్నారు. నవ్వడానికి...నేర్చుకోవడానికి సంబంధం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఏడాదిన్నర పిల్లలపై విస్తృత పరిశోధనలు నిర్వహించిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. 18 నెలల వయసున్న కొంత మంది పిల్లలను రెండు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గానికి పెద్ద బొమ్మలు ఇచ్చి ఎలా ఆడాలో వివరించారు. రెండో గ్రూపుకు పెద్ద బొమ్మను చూపించి నేలకేసి కొట్టారు. దీంతో రెండో వర్గంలోని పిల్లలు బిగ్గరగా నవ్వి వారు కూడా అలా చేయడానికి ఉత్సాహం చూపించారు. దీంతో పిల్లల్ని ఏదో ఒక విధంగా నవ్విస్తే వారు నేర్చుకుంటారని పరిశోధకులు గుర్తించారు.

  • Loading...

More Telugu News