: ఆ కారు ఇంకా అందుబాటులోకి రాలేదు...కానీ, హ్యాక్ చేసే అవకాశం వుందట!
కారు ఇంకా అందుబాటులోకి రాలేదు, కానీ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డ్రైవర్ లెస్ కార్లను గూగుల్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు తయారు చేస్తున్నాయి. ఇవింకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నాయి. టెస్ట్ డ్రైవ్ నడుస్తోంది. మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత సెన్సర్ల ద్వారా నడిచే ఈ కార్లు ప్రయోగాత్మక దశలో ఉన్నాయి. సెన్సర్లతో వీటిని నియంత్రించే అవకాశం ఉండడంతో వీటిని హ్యాక్ చేయడం పెద్ద కష్టం కాదని పరిశోధకులు చెబుతున్నారు. కమాండ్ ల ఆధారంగా నడిచే ఈ కార్లను లేజర్ కిట్ ద్వారా హ్యాక్ చేయవచ్చని వారు వెల్లడించారు. ఈ కిట్ కూడా పెద్ద ఖరీదు కాదని, 40 పౌండ్ల ధర ఉంటుందని వారు తెలిపారు. దీంతో వీటితో ప్రయాణించే మార్గాన్ని నియంత్రించవచ్చని వారు చెబుతున్నారు. కార్లు అందుబాటులోకి వచ్చాక కానీ హ్యాకింగ్ అంశం నివృత్తి కాదు.