: నితీష్, లాలూకు ఒక్క సీటు కూడా రానివ్వం: రాజీవ్ ప్రతాప్ రూడీ


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ లకు ఒక్క సీటు కూడా రాకుండా చేయడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. ఆయన అధికారిక నివాసంలో ఒక ఆంగ్ల పత్రికకు యిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పది సంవత్సరాల నితీష్ పాలనలో ఆయన ఒరగబెట్టిందేమి లేదని ఆరోపించారు. బీహారీ ప్రైడ్ అంటూ దానిని పెద్ద అంశం చేస్తున్న ముఖ్యమంత్రి నితీష్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తో చేతులు కలిపినప్పుడే ఆ ప్రైడ్ పోయిందంటూ రూడీ విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ మద్దతుదారులెవ్వరూ నితీష్ ను తమ నేతగా ఒప్పుకోరన్నారు. జేడీ(యు), ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకు క్యాస్ట్ కాంబినేషన్ అనుకూలంగా ఉందన్న విషయంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.

  • Loading...

More Telugu News