: ఏపీ, తెలంగాణ సీఎస్ ల భేటీ


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు కృష్ణారావు, రాజీవ్ శర్మలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. ప్రధానంగా ఉద్యోగుల విభజన, 9, 10 షెడ్యూల్ లో ఉన్న సంస్థల విభజన తదితర అంశాలపై చర్చలు జరిపారు. ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తే ఏ సమస్యనైనా చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఈ సందర్భంగా ఇద్దరు సీఎస్ లు నిర్ణయించారు. సమావేశం అనంతరం ఏపీ సీఎస్ మాట్లాడుతూ, విద్యుత్తు ఉద్యోగుల అంశంపై చర్చించామని... అయితే, ఈ అంశంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు.

  • Loading...

More Telugu News