: బ్యాంకాక్ బాంబు పేలుళ్ల కేసులో అరెస్టయిన భారతీయుల విడుదల


గత నెలలో సెంట్రల్ బ్యాంకాక్ లో ఉన్న బ్రహ్మ దేవుడి ఆలయానికి సమీపంలో సంభవించిన బాంబు పేలుడులో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు భారతీయులను అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరిపారు. ఈ రోజు వారిద్దరినీ విడుదల చేశారు. తాము అదుపులోకి తీసుకున్న వారిద్దరి వద్ద సరైన వర్క్ పర్మిట్ లు ఉన్నాయని... అందువల్ల వారిద్దరిపై కేసు నమోదు చేయకుండానే విడుదల చేశామని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసుల విచారణ ఎదుర్కొన్న వారిలో ఒకరు కర్ణాటక వాసి కాగా, మరొకరు జమ్ము కాశ్మీర్ వాసి.

  • Loading...

More Telugu News