: ఆ అక్కాచెల్లెళ్లతో రాఖీ కట్టించుకుని దారుణానికి పాల్పడ్డారు!


సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. జిల్లాలోని కల్లూరు మండల కేంద్రానికి చెందిన అక్కాచెళ్లెళ్లు మూడేళ్ల క్రితం తిరుపతి వెళ్లారు. ఈ సందర్భంగా ఇద్దరు వ్యక్తులు వారికి పరిచయమయ్యారు. ఆ ఇద్దరూ రాఖీ పౌర్ణిమ సందర్భంగా కల్లూరు వచ్చి, వారిద్దరితో రాఖీ కట్టించుకున్నారు. అనంతరం వారిని అనంతపురం జిల్లా వజ్రకరూరు తీసుకెళ్లారు. అక్కడ వారిని నిర్బంధించి, అత్యాచారానికి పాల్పడ్డారు. పదవ తరగతి చదువుతున్న బాధితులిద్దరూ పోలీసులను ఆశ్రయించడంతో నిందితులను వజ్రకరూరుకు చెందిన వినోద్, మహేష్ గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుల కోసం గాలిస్తున్నారు.

  • Loading...

More Telugu News