: కడప పోలీస్ స్టేషన్ లో సోనియాగాంధీపై బీజేపీ నేతల ఫిర్యాదు
ఏపీకి ప్రత్యేక హోదాపై మోదీ, వెంకయ్య, చంద్రబాబులపై కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేస్తే, ఇప్పుడు ఆ పార్టీ నేతలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కడప పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై ఫిర్యాదు చేశారు. దశ, దిశ లేకుండా ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా విభజించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సోనియాతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, రఘువీరారెడ్డిలపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.