: మీరెవరు చెప్పడానికి?... బీజేపీ ప్రతిపాదనను వ్యతిరేకించిన ఆర్ఎస్ఎస్
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినా తొందర్లోనే సమసిపోతుంటాయి. తాజాగా ఈ రెండింటి మధ్య అలాంటి అభిప్రాయ భేదమే వ్యక్తమైంది. జైనులకు పవిత్రమైన పర్యుషాన్ (అహింసతో కూడిన దీక్ష) సందర్భంగా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో ఎవరూ మాంసం తినవద్దు అంటూ బీజేపీ ప్రచారం ప్రారంభించింది. దీనిపై ఆర్ఎస్ఎస్ మండిపడుతోంది. ఎవరు ఏది తినాలో, ఏది తినకూడదో చెప్పే హక్కు ఎవరికీ లేదని ఆర్ఎస్ఎస్ స్పష్టం చేసింది. దేశంలో 85 శాతం మంది ప్రజలు మాంసాహారులేనని ఆర్ఎస్ఎస్ నేత సంజయ్ రావత్ తెలిపారు. దీనిపై బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) లో తీర్మానం ప్రవేశపెడితే కేవలం 29 ఓట్లే వచ్చాయని ఆయన గుర్తు చేశారు.