: కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరో పసిడి


కామన్ వెల్త్ యూత్ గేమ్స్ లో భారత్ కు మరో స్వర్ణ పతకం దక్కింది. సమోవాలో జరుగుతున్న ఈ క్రీడా పోటీల్లో వెయిల్ లిఫ్టర్ దీపక్ లాథర్ ఈ పతకాన్ని సాధించాడు. వెయిట్ లిఫ్టింగ్ 62 కేజీల విభాగంలో పదిహేను సంవత్సరాల దీపక్ ఈ పతకం గెలుచుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలోనే భారత్ కు ఇప్పటికే మరో స్వర్ణం వచ్చింది. మొదటి రోజు 56 కేజీల విభాగంలో జంజాంగ్ దేరు స్వర్ణం గెలుచుకున్నాడు. ఈ నెల 5న ప్రారంభమైన ఈ క్రీడలు 11 వరకు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News