: సాయుధ బలగాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలి: రాజ్ నాథ్ సింగ్


సాయుధ బలగాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాల్సి ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశాన్ని అస్థిరపరచడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉంటాయని... వాటిని ఎదుర్కోవడానికి రక్షణ బలగాలు సిద్ధంగా ఉండాలని చెప్పారు. విధినిర్వహణలో భాగంగా టెక్నాలజీని ఎప్పటికప్పుడు మెరుగుపరచుకోవాలని అన్నారు. సికింద్రాబాద్ హకీంపేట్ లో ఉన్న నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో ఈరోజు 29వ బ్యాచ్ అడిషనల్ కమాండెంట్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్ నాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్లిష్ట పరిస్థితుల్లో కూడా సీఐఎస్ఎఫ్ అందిస్తున్న సేవలు అత్యద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.

  • Loading...

More Telugu News