: "అమ్మా క్షమించు... నేనో చెదిరిన స్వప్నాన్ని" అంటూ తనువు చాలించిన వైజాగ్ విద్యార్థిని


చార్టెడ్ ఎకౌంటెంట్ పరీక్షల్లో ఫెయిలయినందుకు మనస్తాపంతో వైజాగ్ విద్యార్థిని గణిశెట్టి సూర్యదుర్గ (19) ఆత్మహత్య చేసుకుంది. మరణించే ముందు సూసైడ్ నోట్ రాసింది. తల్లిని క్షమించమని వేడుకుంది. తన కోసమే అమ్మ కష్టపడుతోందని ప్రస్తావించింది. అంచనాలు అందుకోలేకపోయానని బాధపడింది. తన కల చెదిరిందని, అందుకే వెళ్లిపోతున్నానని తెలిపింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, వైజాగ్ పరిధిలోని సీబీఎం కాంపౌండ్ సమీపంలో నాగేశ్వర్రావు అనే ప్లంబర్ నివాసం ఉంటున్నాడు. ఆయన కూతురు సూర్యదుర్గ సీఏ, సీపీటీ విద్యను ప్రైవేటుగా చదువుతోంది. ఇటీవల రెండవ సంవత్సరం ఫలితాలు రాగా, దుర్గ రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయింది. ఆ నాటి నుంచి ముభావంగా ఉంటూ ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటం లేదు. అదే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలిని సందర్శించిన పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News