: కాశ్మీర్ అంశం ఉంటేనే చర్చలు!: పాక్ జాతీయ భద్రతా సలహాదారు


అజెండాలో కాశ్మీర్ అంశం ఉంటేనే భారత్ తో చర్చలు జరుపుతామని పాకిస్థాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ అన్నారు. ఈ విషయంలో యావత్ ప్రపంచం తమకు మద్దతిస్తోందని, ఎన్నో ఏళ్లుగా నలుగుతూ, ఒక కొలిక్కిరాని అన్ని సమస్యలతో పాటు కాశ్మీర్ అంశంపై కూడా చర్చించాల్సిన అవసరం ఇరు దేశాలకు ఉందని సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని రేడియో పాకిస్థాన్ మంగళవారం నాడు ప్రకటించింది. పాకిస్థాన్ లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఉన్నాడన్న వార్తను ఆయన ఖండించారు. పాకిస్థాన్ రేంజర్స్ చీఫ్, ఇండియన్ బీఎస్ఎఫ్ కమాండర్ ల సమావేశం బుధవారం నాడు ఢిల్లీలో జరగనున్నట్లు తెలిపారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతున్నట్లు ఆయన చెప్పారు. 2003 కాల్పుల విరమణ ఒప్పందం అమలు అంశం ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. మొదటి నుంచి పాకిస్థాన్ కు వ్యతిరేకంగానే భారత్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని సర్తాజ్ ఆరోపించారు.

  • Loading...

More Telugu News