: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి... ‘సీమ’ నేత టీజీ వెంకటేశ్ డిమాండ్
రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత, మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ మరోమారు మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యుత్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా విధుల్లో నుంచి తొలగించిన కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాయలసీమ హక్కులు పరిరక్షించకపోతే ఎన్నికల్లోగా రాయలసీమ హక్కుల వేదిక రాజకీయ పార్టీగా అవతరిస్తుందని ఆయన ప్రకటించారు. కర్నూలును ఏపీకి రెండో రాజధానిగా ఎంపిక చేయాలని ఆయన డిమాండ్ చేశారు.