: గంజాయి కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత అరెస్టు
గంజాయి కేసులో విశాఖ జిల్లా మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సంజీవరావును అనకాపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఆయన భార్య జడ్పీటీసీగా ఉన్నారు. రాజమండ్రిలోని రాజవొమ్మంగి మండలం బొబ్బిలిమడుగులో జరిగిన మరో సంఘటనలో గంజాయిని సాగు చేస్తున్న ఓ గిరిజనుడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.