: సోదరుడిని భుజాలపై మోస్తూ 8 కి.మీ. నడిచిన 11 ఏళ్ల బాలిక!


11 సంవత్సరాల చిన్నారి. అనారోగ్యంతో ఉన్న తన తమ్ముడిని ఆసుపత్రిలో చేర్చేందుకు 8 కిలోమీటర్ల దూరం నడిచింది. ఆ బాలుడిని భుజాలపై కూర్చోబెట్టుకుని ఆమె నడిచింది. ఆ చిత్రాలు, వీడియోను 'ఏఎన్ఐ' ప్రముఖంగా ప్రసారం చేసింది. ఆ బాలిక దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చకు తెరతీశాయి. వేలాది మంది వాటిని షేర్ చేసి ప్రభుత్వాల తీరును ప్రశ్నించారు. మావోయిస్టుల ప్రభావం అత్యధికంగా ఉన్న ట్రైబల్ రాష్ట్రం జార్ఖండ్ లో ఈ ఘటన జరిగింది. ఆరోగ్య సేవల విషయంలో దేశంలోనే అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా ఉన్న జార్ఖండ్ లో కోట్లాది మందికి రవాణా, వైద్య, విద్యా సదుపాయాలు దక్కడం లేదనడానికి ఇదో ఉదాహరణ. పాలకులు మారినా ప్రజల దయనీయ పరిస్థితుల్లో ఎటువంటి మార్పు లేదనడానికి ఈ చిత్రాలే నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాగా, ప్రస్తుతం జార్ఖండ్ లో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నప్పటికీ, ఆదివాసీల జీవితాల్లో వెలుగులు మచ్చుకైనా కనిపించడం లేదని ప్రజలు వాపోతున్నారు.

  • Loading...

More Telugu News