: బ్యాంకాక్ లో మిస్టీరియస్ ఫైర్ బాల్... ఒక్కరోజులో 21 లక్షల మంది చూసేశారు!


సోమవారం, ఉదయం 8:45 గంటలు. బ్యాంకాక్ లోని నంతబురి ప్రాంతంలో పుర్జాయ్ జతురోంగఖాకున్ అనే వ్యక్తి తన కారులో వెడుతున్నాడు. కారులో రోడ్డువైపు అమర్చివున్న సీసీ కెమెరాలో ఓ అరుదైన దృశ్యం రికార్డయింది. ఆకాశం నుంచి మెరుస్తూ వచ్చిన ఓ ఫైర్ బాల్, నిప్పులు కక్కుతూ, మండిపోతూ కిందపడింది. ఆ సమయంలో ప్రయాణిస్తున్న వారంతా దీన్ని చూశారు. ఈ దృశ్యాలను పుర్జాయ్ యూట్యూబ్ లో పెడితే, ఒక్క రోజు వ్యవధిలో 21 లక్షల మందికి పైగా దీన్ని చూశారు. బ్యాంకాక్ లో ఎక్కడా ఉల్కలు పడిన సమాచారం అందలేదని అక్కడి ప్లానిటోరియం అధికారులు వెల్లడించడం గమనార్హం. మరైతే ఈ ఫైర్ బాల్ ఏంటి? ఎక్కడిది? అని దీన్ని చూసిన వారు ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News