: పెన్నులు కూడా తేకుండా పరీక్షలకు రండి: సీటెట్ అభ్యర్థులకు సీబీఎస్ఈ ఆదేశం


ఈనెల 20న సీబీఎస్ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షలకు పెన్నులు కూడా అభ్యర్థులు తీసుకురాకూడదన్న ఆదేశాలు వెలువడ్డాయి. మరి పరీక్షలు ఎలా రాయాలని అనుకుంటున్నారా? అభ్యర్థులకు అవసరమయ్యే పెన్నులను సీటెట్ యూనిట్ సరఫరా చేస్తుంది. పెన్నులతో పాటు మరే ఇతర వస్తువులనూ తీసుకురాకూడదని తెలిపింది. కాగితాలు, జ్యామెట్రీ బాక్సులు, పెన్సిళ్లు, ప్లాస్టిక్ పౌచ్ లు, క్యాలిక్యులేటర్లు, స్కేల్, రైటింగ్ ప్యాడ్, పెన్ డ్రైవ్, ఎరేజర్, లాగ్ టేబుల్, కార్డ్ బోర్డ్, పర్సులు, హ్యాండ్ బ్యాగ్స్, కళ్లద్దాలు తదితర ఎటువంటివీ తేకూడదని ఆదేశించింది. వీటితో పాటు ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తేకూడదని, కేవలం హాల్ టికెట్ తో మాత్రమే రావాలని, దీనికి అదనంగా ఫోటో ఐడెంటిఫికేషన్ కోసం పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్టు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లలో ఏదో ఒకటి వెంట తెచ్చుకోవాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News