: చైనాలో బిజీ అయిపోయిన కేసీఆర్!
దాదాపు 10 గంటలకు పైగా సుదీర్ఘ ప్రయాణం తరువాత, గత రాత్రి విశ్రాంతి తీసుకున్న కేసీఆర్ ఈ ఉదయం నుంచి బిజీ అయిపోయారు. తెలంగాణకు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా మొదలైన ఆయన పర్యటనలో తొలి భేటీ చైనాలోని భారత రాయబారితో జరిగింది. ఈ ఉదయం డేనియల్ నగరంలో ఇండియన్ అంబాసిడర్ అశోక్ కాంతాతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో నూతనంగా ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం గురించిన వివరాలు ఆయనకు తెలిపారు. ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ కేశవరావులతో పాటు పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు. తదుపరి మధ్యాహ్న భోజనం తరువాత కేసీఆర్ కొందరు ప్రవాస భారతీయులను, పారిశ్రామికవేత్తలను కలసి పెట్టుబడులపై చర్చించనున్నారు.