: 27న టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక
ప్రతి రెండు సంవత్సరాలకోసారి జరిగే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్ష పదవి ఎన్నికలకు ఆ పార్టీ షెడ్యూల్ ను విడుదల చేసింది. దీని ప్రకారం రేపటినుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. 25న నామి నేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 27న అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు జరిగే పార్టీ ఆవిర్భావ సభలో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒకవేళ ఒకరికి కంటే ఎక్కువ మంది అభ్యర్ధులు బరిలో ఉంటే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఎన్నిక ప్రక్రియ ఉంటుంది. ఈ ఎన్నికలకు అధికారిగా టీఆర్ఎస్ నేత నాయిని నర్సింహారెడ్డి వ్యవహరిస్తారు.