: భూసేకరణ చట్ట సవరణలకు వ్యతిరేకంగా మన పోరాటం ఫలించింది: సోనియాగాంధీ


భూసేకరణ చట్ట సవరణలకు వ్యతిరేకంగా తమ పోరాటం ఫలించిందని ఢిల్లీలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వ వెనక్కి తగ్గిందనడానికి ఈ విజయమే నిదర్శమని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం నేల విడిచి సాము చేస్తుందనడానికి భూసేకరణ బిల్లు ఉపసంహరించుకోవడమే నిదర్శనమని పార్టీ నేతలకు సోనియా చెప్పారు. ఇటీవల జరిగిన ఆర్ఎస్ఎస్ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరవడంపై విమర్శలు చేశారు. ఈ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో నడుస్తోందన్న విషయం రుజువైందని, ఈ భేటీతో దేశం మొత్తానికి తెలిసిందన్నారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థ బలపడలేదని, స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయని, ధరలు పెరిగాయని, ఉపాధి కల్పన ఏ మాత్రం పెరగలేదని సోనియా మండిపడ్డారు.

  • Loading...

More Telugu News