: చైనా పరిస్థితే బాగాలేదు... అక్కడ నుంచి కేసీఆర్ ఏం పెట్టుబడులు తెస్తారు?: పొన్నం


ప్రత్యేక విమానంలో, భారీ బృందంతో చైనా వెళ్లిన టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. కేసీఆర్ బయలుదేరిన విమానం ఖర్చు అక్షరాలా రెండున్నర కోట్ల రూపాయలని ఆయన చెప్పారు. కేసీఆర్ చైనా వెళ్ళిన తీరు రాచరికాన్ని గుర్తు చేస్తోందని విమర్శించారు. ఒక వైపు రైతులు కష్టాలతో సహజీవనం చేస్తూ, ఆత్మహత్యలకు పాల్పడుతుంటే... కేసీఆర్ కు చైనా పర్యటన కావాల్సి వచ్చిందా? అని ప్రశ్నించారు. అసలు చైనా పరిస్థితే దారుణంగా ఉంది... మార్కెట్లు కుప్పకూలిపోయాయి... ఇలాంటి పరిస్థితుల్లో చైనా నుంచి కేసీఆర్ ఏం పెట్టుబడులు తీసుకొస్తారని పొన్నం ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News