: మరిన్ని గ్రామాలను దత్తత తీసుకుంటా... కొండారెడ్డిపల్లిలో ప్రకాశ్ రాజ్ ప్రకటన


టాలీవుడ్ ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ నేటి ఉదయం పాలమూరు జిల్లా కొండారెడ్డిపల్లి చేరుకున్నారు. ఈ గ్రామ పర్యటన తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడం తనకు గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. కొండారెడ్డిపల్లి ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని పల్లెలను దత్తత తీసుకుంటానని ఆయన ప్రకటించారు. నిన్న టీఎస్ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును కలిసిన సందర్భంగా కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News