: దత్తత గ్రామంలో పర్యటిస్తున్న సినీ నటుడు ప్రకాష్ రాజ్
తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లిలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ పర్యటిస్తున్నారు. ఆ గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్టు నిన్న ప్రకటించిన ఆయన తదుపరి రోజే అక్కడికి వెళ్లడం గమనార్హం. ఈ క్రమంలో గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆయన పరిశీలించారు. అంతేగాక గ్రామంలోని పలు సమస్యలపై అక్కడి వారిని అడిగి తెలుసుకోనున్నారు. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రకాశ్ రాజ్ కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నారు. మంత్రి కేటీఆర్ ను కలసి దానికి సంబంధించిన విషయాలను మాట్లాడిన సంగతి తెలిసిందే.