: రూపాయి విలువ మరింత తగ్గాలి: ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య వింత వ్యాఖ్య


సాధారణంగా డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పెరగాలని అందరూ కోరుకుంటారు. అయితే ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చీఫ్ అరుంధతీ భట్టాచార్య నిన్న ఇందుకు విరుద్ధమైన వ్యాఖ్య చేశారు. ఇప్పటికే రెండేళ్ల కనిష్ఠ స్థాయికి చేరుకున్న రూపాయి విలువ మరింత పడిపోవాలని ఆమె వ్యాఖ్యానించారు. అదేంటీ, రూపాయి విలువ మరింత పెరగాలని కోరుకోవాల్సిన భట్టాచార్య విలువ తగ్గాలని ఎందుకు వ్యాఖ్యానించారనేగా మీ అనుమానం? ఈ వ్యాఖ్య వెనుక కారణం లేకపోలేదులెండి. దేశీయ ఎగుమతులు పుంజుకోవాలంటే, రూపాయి విలువ మరింత తగ్గాలన్న కోణంలోనే ఆమె ఈ వ్యాఖ్య చేశారు. రూపాయి మారకం విలువ పెరిగితే దేశీయ ఎగుమతిదారులు అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడలేరని ఆమె అభిప్రాయపడ్డారు. దేశీయ ఎగుమతులు పెరగాలంటే, రూపాయి విలువ మరింత తగ్గాల్సిందేనని భట్టాచార్య వాదిస్తున్నారు.

  • Loading...

More Telugu News