: తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో వజ్రాల కొండ... అమెరికన్ జర్నల్ లో ప్రత్యేక కథనం


తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అత్యంత విలువైన వజ్రాలు, బంగారం గనులున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారని అమెరికా కేంద్రంగా వెలువడుతున్న ప్రతిష్ఠాత్మక 'పెలాజియా' జర్నల్ లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ గనులను ఉస్మానియా విశ్వవిద్యాలయం భూ భౌతిక శాస్త్రవేత్తలు, రీసెర్చర్లు కనుగొన్నారని ప్రకటించింది. కృష్ణా, హాలియా, మూసీ, కనగల్ నదీ పరీవాహక ప్రాంతాల్లో వజ్రాల గనుల ఆనవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా రామడుగు ప్రాంతంలోని గనులకు పశ్చిమ ఆస్ట్రేలియాలోని గనులకు దగ్గరి పోలికలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. హాలియా రివర్ డ్రైవ్ బేసిన్ లో 26 చదరపు కిలోమీటర్ల పరిధిలో 3 మీటర్ల వరకూ మందమున్న రాంప్రొయిట్ రాళ్లు ఉన్నాయని, పసుపు నుంచి ఆకుపచ్చ రంగుల్లో ఉండే వీటిల్లో కార్బొనేట్స్, సర్పింటైన్, ప్లోగ్రోఫైట్ తదితరాలు ఉన్నాయని, ఇటువంటి ప్రాంతాల్లో కచ్చితంగా వజ్రాల గనులుంటాయని వారు చెబుతున్నారు. తమ పరిశోధన నివేదికలను ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు వివరించారు.

  • Loading...

More Telugu News