: బ్రాడ్ మన్ బ్లేజర్ కు ఊహించని ధర... రూ.61 లక్షలకు సొంతం చేసుకున్న అభిమాని


క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ కు స్ఫూర్తిగా నిలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం సర్ డాన్ బ్రాడ్ మన్ కు చెందిన ఓ బ్లేజర్ కు ఊహించని ధర లభించింది. 1936-37లో జరిగిన టెస్టు సిరీస్ లో ఆసీస్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా బ్రాడ్ మన్ ధరించిన ఆ బ్లేజర్ ను ఆయన అభిమాని ఒకరు కళ్లు చెదిరే ధర చెల్లించి సొంతం చేసుకున్నారు. నిర్వాహకుల అంచనాలను తలకిందులు చేస్తూ బ్రాడ్ మన్ అభిమాని ఒకరు దానిని ఏకంగా రూ.61 లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు.

  • Loading...

More Telugu News