: ఎయిర్ ఇండియా విమానంలో మంటలు
ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య కారణంగా మంటలు రావడంతో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ఈ సంఘటన ఢిల్లీలో జరిగింది. వారణాసి..ఢిల్లీల మధ్య తిరిగే ఏఐ 405 విమానం సోమవారం ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు వచ్చింది. టేకాఫ్ తీసుకున్న అనంతరం ఇంజన్ లో మంటలు వ్యాపించడాన్ని గ్రహించిన సిబ్బంది వెంటనే దించివేశారు. ఈ విమానంలో 153 మంది ప్రయాణికులు ఉన్నారని, వారందరూ సురక్షితమని ఎయిర్ పోర్ట్ సిబ్బంది పేర్కొన్నారు.