: మరో నటితో యువరాజ్ సింగ్ ప్రేమాయణం
బంతిని స్టాండ్స్ లోకి పంపించడమే కాదు, సుందరాంగులతో డేటింగ్ చేయడంలో కూడా డాషింగ్ బ్యాట్స్ మెన్ యువరాజ్ సింగ్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పటి వరకు యువీ డేటింగ్ చేసిన ముద్దుగుమ్మల జాబితా చెబితే కొంచెం పెద్దగానే ఉంటుంది. బాలీవుడ్ నటీమణులు దీపికా పదుకోనే, కిమ్ శర్మ తదితరులతో యువీ సాగించిన ప్రేమాయణం గురించి పలు కథనాలు వెల్లువెత్తాయి. తాజాగా, యువీ జాబితాలో మరో ముద్దుగుమ్మ చేరింది. బ్రిటీష్ మోడల్, నటి హజెల్ కీచ్ తో యువీ డేటింగ్ చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. హజెల్ కీజ్ హిందీ సినిమా 'బాడీగార్డ్'లో కూడా నటించింది. వీరిద్దరూ కలసి ఇటీవలే లండన్ ట్రిప్ వేశారని, ఇద్దరూ కలిసే ఇండియాకు తిరిగి వచ్చారని వార్తలు షికారు చేస్తున్నాయి.