: హైదరాబాదులో ఇంజెక్షన్ సైకో దాడి


ఏపీని హడలెత్తిస్తున్న ఇంజెక్షన్ సైకోలు, ఈ రోజు తెలంగాణలోని నల్గొండ జిల్లాలో సైతం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఇంజెక్షన్ సైకోల దాడులు ఉమ్మడి రాజధాని హైదరాబాదుకు కూడా పాకడం కలకలం రేపుతోంది. ఎల్బీనగర్ లో ఈరోజు సైకో దాడి జరిగింది. ఎల్ఐసీ ఆర్ఎంగా పని చేస్తున్న స్వామి నాయక్ అనే వ్యక్తి బస్సులో ప్రయాణిస్తుండగా ఓ దుండగుడు సూదితో పొడిచి పరారయ్యాడు. అనంతరం, స్వామి నాయక్ ను వైద్య పరీక్షల నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News