: తెలంగాణకు వ్యాపించిన సూదిగాళ్లు... నల్గొండ జిల్లాలో కలకలం
ఏపీలో కలకలం రేపుతున్న సూదిగాళ్లు తెలంగాణకు కూడా పాకారు. తాజాగా ఈ రోజు నల్గొండ జిల్లాలో తమ ప్రతాపం చూపి, జనాలను ఉలిక్కి పడేలా చేశారు. వివరాల్లోకి వెళ్తే, కోదాడ మండలం కాపుగల్లు గ్రామంలో బైక్ పై వెళ్తున్న రైతు వీరయ్యకు సూది గుచ్చిన ముగ్గురు ఆగంతుకులు ఆటోలో పరారయ్యారు. వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు తరలించారు. ఈ ఉదంతం గురించి తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.