: ఢిల్లీలో పెరిగిపోతున్న డెంగ్యూ కేసుల సంఖ్య!
దేశ రాజధాని ఢిల్లీలో డెంగ్యూ వ్యాధి కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఏడాది సెప్టెంబర్ మొదటి వారానికి నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య సుమారు 1,260. గడచిన ఐదేళ్లలో ఇవి చాలా ఎక్కువ కేసులు. సోమవారం నాటి మున్సిపల్ నివేదికల ప్రకారం 428 కొత్త కేసులు ఈ నెలలో నమోదైనవే. మాసాల వారీగా అత్యధికంగా డెంగ్యూ కేసులు నమోదైంది ఆగస్టులో. కేవలం ఈ నెలలో 778 కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టు 31 వ తేదీ నాటికి నమోదైన మొత్తం కేసుల సంఖ్య 831. 2014వ సంవత్సరంలో 33 కేసులు, 2013లో 255, 2012లో 17,2011వ సంవత్సరంలో 104 డెంగ్యూ కేసులు నమోదైనట్లు నివేదికల సమాచారం.