: న్యాయవాదిని పొట్టనబెట్టుకున్న క్లయింట్!
ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి తన దగ్గర ఉన్న తుపాకీతో న్యాయవాదిని కాల్చి పారేశాడు ఆ క్లయింట్! ఈ సంఘటన చెన్నైలో జరిగింది. పలు హత్య కేసుల్లో నిందితుడిగా ఉన్న ఈశ్వర్, తన లాయర్ కామేష్ ను కలిశాడు. వీరిద్దరూ మమల్లాపురంలోని బార్ లో మద్యం తాగారు. అనంతరం కారులో బయలుదేరారు. ఒక విషయమై ఇద్దరూ వాదులాడుకున్నారు. ఆవేశాన్ని అదుపు చేసుకోలేకపోయిన ఈశ్వర్ తన వద్ద ఉన్న తుపాకీతో కామేష్ ను కాల్చాడు. కామేష్ తీవ్రంగా గాయపడటంతో ఈశ్వర్ పారిపోయాడు. ఈ సమాచారాన్ని లాయర్ తన మిత్రులకు ఫోన్ ద్వారా చెప్పాడు. అయితే, వాళ్లు అక్కడికి వచ్చి ఆసుపత్రికి తరలించేటప్పటికే కామేష్ మృతి చెందాడు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.