: థాయ్ లాండ్ లో బాంబు దాడి కేసు.. కస్టడీలో ఇద్దరు భారతీయులు


గత నెలలో థాయ్ లాండ్ లోని బ్రహ్మ ఆలయం వద్ద జరిగిన బాంబు దాడి కేసులో ఇద్దరు భారతీయులను అక్కడి పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న ఒక విదేశీయుడితో భారతీయులిద్దరూ మాట్లాడుతున్నట్లు సీసీటీవీల్లో రికార్డు అయింది. విచారణ నిమిత్తం వారిని మిలిటరీ క్యాంపునకు తరలించారు. మిన్బురిలోని మైమునా గార్డెన్ హోమ్ అపార్టుమెంట్ నుంచి భారతీయులిద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు అక్కడి మీడియాలో వార్తలొస్తున్నాయి.

  • Loading...

More Telugu News