: ప్రకాశ్ రాజ్ కూడా 'శ్రీమంతుడు' అయ్యాడు!


సంపాదనపరంగా ఎప్పుడో శ్రీమంతుడు అయిన సినీ నటుడు ప్రకాష్ రాజ్... ఇప్పుడు మానవతా ధృక్పథంతో మరోసారి శ్రీమంతుడయ్యాడు. ఇటీవలే విడుదలై ఘన విజయం సాధించిన 'శ్రీమంతుడు' సినిమా తరహాలో ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామజ్యోతి కార్యక్రమంతో స్ఫూర్తి పొందిన ప్రకాష్ రాజ్ నేడు టీఎస్ మంత్రి కేటీఆర్ ను ఆయన కార్యాలయంలో కలిశారు. మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లె అనే గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని, అన్ని రకాలుగా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఆయన ఈ సందర్భంగా కేటీఆర్ కు తెలిపారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చిన ప్రకాష్ రాజ్ ను కేటీఆర్ అభినందిస్తూ, హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ప్రకాష్ రాజ్ కింద విధంగా ట్వీట్ చేశారు. Had a far reaching meeting with minister Mr KTR in connection with adopting a village. Journey begins.. Details soon.

  • Loading...

More Telugu News