: నరసాపురం ఎమ్మెల్యే మాధవనాయుడు సుప్రీంలో పిటిషన్
నరసాపురం మార్కెట్ యార్డు భూములను పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యే మాధవనాయుడు ఆక్రమించారని దాఖలైన కేసులో జరిమానాతో పాటు క్షమాపణ చెప్పాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు రిజిస్ట్రార్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.